« ఓ సంఘమా సర్వాంగమా
O sanghama saarvangama
share with whatsapp

పల్లవి:
ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా   
యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా   
ఓ సంఘమా వినుమా   
1.
రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో   
వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో   
ఆనంద తైల సుగంధాభిషేకము    (2X)
పొందితినే యేసునందు    (2X)
...ఓ సంఘమా...
2.
క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని   
స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ   
మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు    (2X)
సహియింతువా తీర్పునాడు    (2X)
...ఓ సంఘమా...
3.
చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు   
శ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని   
గుర్తించుచుంటివా క్రియలను గంటివా    (2X)
సజీవముగా నున్నావా    (2X)
...ఓ సంఘమా...
4.
చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగునా   
నులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమో   
నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో    (2X)
ఆసక్తితో రక్షణ పొందుమా    (2X)
...ఓ సంఘమా...
5.
కడపటిబూర మ్రోగగానే- కనురెప్ప పాటున మారుదువా- వడిగా   
మేఘాసీనుడవై- నడియాకాశము పోగలవా-గొఱ్ఱెపిల్ల సంఘమా    (2X)
క్రీస్తురాజు సంఘమా- రారాజు నెదుర్కనగలవా    (2X)
...ఓ సంఘమా...